
రవితేజ నటిస్తున్న ‘కిక్ 2’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. ఈ చిత్రాన్ని మే 7న విడుదలచెయ్యడానికి చిత్రబృందం అహర్నిశలు కష్టపడుతుంది.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. రవితేజ, థమన్ ల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘కిక్’ని మలచిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.