ప్రముఖ సినీ నటుడు మృతి !

Published on Apr 25, 2021 6:40 pm IST

ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గివీరుడు’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయినా ఆయన ఆ తరువాత దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర కనిపించి అలరించారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని బంధువులు అధికారికంగా ప్రకటించారు.

ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. ‘రాధమ్మ పెళ్లి’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్‌’, ‘గజదొంగ’, ‘గోల నాగమ్మ’, ‘అత్తగారి పెత్తనం’, ‘టార్జాన్‌ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. 123తెలుగు.కామ్ తరఫున పొట్టి వీరయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :