
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘పవర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక డ్రామా సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెజీన సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

