ద్విత్వ గా వస్తున్న పవర్ స్టార్!

Published on Jul 1, 2021 8:54 pm IST


కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నెక్స్ట్ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. అయితే టైటిల్ తో పాటుగా పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ద్విత్వ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రం అయిన కేజీఎఫ్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుంది. విజయ్ కిరంగదుర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కుమార్ దరకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం పూర్ణ చంద్ర తేజస్వి అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ విడుదల కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతూ, షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :