నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానినంటున్న పవర్ స్టార్ !

11th, February 2018 - 06:22:05 PM

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక్క తెలుగు పరిశ్రమలోనే నాకాడు అన్ని ప్రశ్రమల్లోనూ ఎనలేని అభిమానం, గౌరవం ఉంది. యువ హీరోలు, నటులైతే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే టక్కున చెప్పే మాట మెగాస్టార్ చిరంజీని. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కన్నడ పవర్ స్టార్ గా పేరున్న స్టార్ నటుడు, అలనాటి నటుడు రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ కలుసుకున్నారు.

ఈ సందర్భాన్ని పునీత్ రాజ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ చిరంజీవిగారిని కలవడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆయనెంతో మంచి వ్యక్తి, గొప్ప నటుడు, అద్భుతమైన డ్యాన్సర్. నేను ఆయనకు పెద్ద అభిమానిని అంటూ తన మెగాస్టార్ పట్ల తనకున్న గౌరవాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే.