ఊహించని రీతిలో కేజీఎఫ్2 ట్రైలర్…మాస్ అండ్ పవర్ఫుల్ గా యాక్షన్ ఎలిమెంట్స్!

Published on Mar 27, 2022 7:00 pm IST


యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్2. పీరియడ్ యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో యశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి పార్ట్ కేజీఎఫ్ కి కేవలం సౌత్ నాట మాత్రమే కాకుండా, దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ రావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ మరియు తుఫాన్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తోంది.

పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ వెర్షన్ లో సూర్య, మలయాళం లో పృధ్వీ రాజ్, హిందీ లో ఫర్హాన్ అక్తర్, కన్నడ లో శివ రాజ్ కుమార్ లు విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలతో నిండి పోయింది. ఒక పక్క అధీర కేజీఎఫ్ కోసం మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాడు. రమీక సేన్ రాకీ భాయ్ ను క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు హీరో ను ఎలివేట్ చేస్తూ ఉండటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2 నిమిషాల 57 సెకన్ల ట్రైలర్ మినీ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ను చూపించేసింది అని చెప్పాలి.

సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదీన భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ యాక్షన్ డ్రామా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :