పడి పడి లేచె మనసు ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందట !

Published on Dec 20, 2018 12:47 pm IST

శర్వానంద్ – సాయి పల్లవి ల రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ మరి కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ముఖ్యంగా యూత్ లో ఈ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. తాజాగా గా ఈ చిత్రం యొక్క ఫస్ట్ హాఫ్ గురించి సన్నిహిత వర్గాల నుండి ఆసక్తికర సమాచారం వస్తుంది.

శర్వా , సాయి పల్లవి ల కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ కి హైలైట్ అయ్యిందని ముఖ్యంగా వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను చాలా బాగా చూపించాడట దర్శకుడు హను రాఘవపూడి. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ కూడా మెప్పించాయని సమాచారం. ఈ లెక్కన ఈ చిత్రం విజయం సాధించడం ఖాయమయ్యేలా వుందని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :