పడి పడి లేచె మనసు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

పడి పడి లేచె మనసు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Dec 10, 2018 2:11 PM IST

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానుండగా చిత్రం యొక్క ట్రైలర్ డిసెంబర్ 14న విడుదలకానుందని సమాచారం. ప్రేమ కథ చిత్రాల దర్శకుడు హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వా, ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి ,డాక్టర్ గా కనిపించనుంది.

చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక మొదటిసారి శర్వా – సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంఫై మంచి అంచనాలు వున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని హైలైట్ కానుంది. డిసెంబర్ 21 న ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు