‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్ కూడా అక్కడే విడుదలకానుంది !

Published on Dec 13, 2018 11:00 am IST

ఇటీవల వరుణ్ తేజ్ నటించిన స్పేస్ థ్రిల్లర్ ‘అంతరిక్షం’ ట్రైలర్ ఈవెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ ఏఎంబి సినిమాస్ లోజరిగిన విషయం తెలిసిందే. తాజాగా శర్వానంద్ – సాయి పల్లవి ల రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్ ఈవెంట్ కూడా అదే వేదిక ఫై జరుగనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. 11 గంటలకు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదలకానుంది.ఇక మొదటిసారి శర్వా – సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంఫై ఇప్పటికే మంచి అంచనాలు నెల కొన్నాయి.

సంబంధిత సమాచారం :