ప్రభాస్ 25వ సినిమాకు సరికొత్త టైటిల్..!

Published on Sep 4, 2021 2:11 am IST


పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ తన 24వ చిత్రాన్ని నాగ్ అశ్విన్‌తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలన్ని పూర్తయ్యాక ప్రభాస్ తన 25వ సినిమాను దిల్‌రాజ్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా మున్నా, మిస్టర్ పర్‌ఫెక్ట్‌ సినిమాలను దిల్‌రాజ్ నిర్మించాడు. అయితే ఓ పెద్ద దర్శకుడితో మరోసారి దిల్‌రాజ్ ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారట. అయితే ఈ సినిమా కథ కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని, దీనికోసం ‘వృందావన’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేయించినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఇదిలా ఉంట 2024లో ప్రభాస్ ఈ 25వ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :