‘కన్నప్ప’ మిస్సింగ్ డ్రైవ్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్..?

‘కన్నప్ప’ మిస్సింగ్ డ్రైవ్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్..?

Published on May 27, 2025 8:00 PM IST

Kannappa12

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించి ఓ హార్డ్ డ్రైవ్ మిస్ కావడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ హార్డ్ డ్రైవ్‌లో సినిమాకు సంబంధించిన ఫుటేజీ ఉందని.. అందుకే దీనిని వెంటనే వెతికే పనిలో చిత్ర యూనిట్, పోలీసులు ఉన్నారని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఈ మిస్సింగ్ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న కంటెంట్ మరెవరిదో కాదట.. రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించిందని తెలుస్తోంది.

‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాలు ఉంటుందని.. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ కూడా ఉన్నాయని.. ఇప్పుడు ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫుటేజీ ఉన్న డ్రైవ్ మిస్ అయిందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ప్రత్యేకంగా నటించి చేసిన యాక్షన్ సీక్వెన్స్ కనిపించకుండా పోవడంతో ‘కన్నప్ప’ టీమ్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మరి ఈ మిస్సింగ్ డ్రైవ్ దొరుకుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు