Raja Saab: ప్రభాస్ ని జోకర్ గా.. మారుతీ ముందున్న పెద్ద సవాల్ ఇదే!

Raja Saab: ప్రభాస్ ని జోకర్ గా.. మారుతీ ముందున్న పెద్ద సవాల్ ఇదే!

Published on Dec 30, 2025 2:10 PM IST

Raja Saab

మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో మంచి స్టార్డం ఉన్న హీరోస్ లో ప్రభాస్ కూడా ఒకరు. రెబల్ స్టార్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా తాను నిలిచారు. అలాగే మన స్టార్ హీరోస్ పై కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఒక స్టేజ్ లోకి వచ్చాక హీరోలు ప్రయోగాలు చేయడం మెయిన్ గా తమ లుక్స్ పరంగా అనే కామెంట్స్ ఉన్నాయి. అయితే దీనికి సమాధానంగా గతంలో అల్లు అర్జున్ సమాధానం ఇస్తే ఇప్పుడు ది రాజా సాబ్ (Raja Saab) సినిమాలో ప్రభాస్ ఊహించని అవతార్ లో చూపించి షాకిచ్చారు.

Prabhas stuns everyone with Joker Look – జోకర్ లుక్ తో ప్రభాస్ ట్విస్ట్

నిజానికి రాజా సాబ్ (Raja Saab) రెండో ట్రైలర్ ని మేకర్స్ చాలా హైప్ ఇస్తూ ప్రెజెంట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ గ్రాండ్ విజువల్స్ మెయిన్ గా ప్రభాస్ ని దర్శకుడు మారుతీ ప్రెజెంట్ చేసిన విధానం ఇక లాస్ట్ లో ప్రభాస్ ని జోకర్ గెటప్ లో చూపించిన దెబ్బకి ఫ్యాన్స్ మైండ్ పోయింది. ఇది మాత్రం అందరికీ ఒక ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

Huge Challenge for Maruthi – మారుతీ ముందు పెద్ద సవాల్

ఇప్పుడు ట్రైలర్ లో ప్రభాస్ ని ఊహించని విధంగా జోకర్ లుక్ లో చూపించడం ఇప్పుడు బాగానే అందరినీ ఎగ్జైట్ చేసింది. ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేసినట్టు క్లియర్ గా కూడా కనిపిస్తుంది. మరి ఇంతలా హార్డ్ వర్క్ చేసిన ప్రభాస్ తో జోకర్ గెటప్ వేయించడం ఒక సవాలు అయితే ఇదే సీక్వెన్స్ ని మారుతీ ఆడియెన్స్ ని మెయిన్ గా ఫ్యాన్స్ కి ఎంత కన్వీనెంట్ గా చెప్తారు అనేది సవాలు అని చెప్పొచ్చు. ఏమాత్రం ఈ సీక్వెన్స్ కి న్యాయం జరిగే సందర్భం సినిమాలో లేదా తర్వాత అది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పర్టిక్యులర్ సీన్ పట్ల మారుతీ ఎలా సీన్ ని రాసుకుని ప్లాన్ చేశారు అనేది రిలీజ్ వరకు ఆగి చూడాలి.

తాజా వార్తలు