‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకు ప్రభాస్ సపోర్ట్..!

‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకు ప్రభాస్ సపోర్ట్..!

Published on Aug 16, 2021 11:01 PM IST

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్ ఇచ్చాడు.

ఈ సినిమా యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసిన ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలియచేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ప్రభాస్ అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి. ఈ సినిమాకు మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 12 కోట్లకు అమ్ముడయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు