ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఆ దేశాల్లో ప్రత్యేక స్క్రీనింగ్.!

Published on Oct 21, 2020 12:14 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు ఖండాంతరాల్లో కూడా ఒక సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే పలు దేశాల్లో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు మూడు భారీ చిత్రాలతో మరోసారి ప్రపంచ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు అప్పుడే హంగామా మొదలు పెట్టేసారు. అలాగే చిత్ర యూనిట్స్ కూడా అప్డేట్స్ తో రెడీగా ఉండగా ప్రభాస్ నటించిన సెన్సేషనల్ హిట్ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ను పలు దేశాలు ప్రభాస్ పుట్టినరోజుకు చేయనున్నారు.

బాహుబలి సినిమాతో జపాన్ దేశస్థులు ప్రభాస్ కు ఫిదా అయ్యిపోయారు. అక్కడ మరియు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని పలు సిటీలలో ప్రభాస్ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా అక్కడ థియేటర్స్ లో వేయనున్నారట. దీనితో ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాల్లో ఏ విధంగా ఉందో మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే అందరి కళ్ళు ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ కోసం ఎదురు చూస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More