డార్లింగ్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది డబుల్ ట్రీట్…!

Published on Aug 11, 2019 9:09 am IST

నిన్న విడుదలైన సాహో ట్రైలర్ కి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఊపిరి బిగపట్టుకుచూసేలా ఉండే యాక్షన్ సన్నివేశాలు,అంతుచిక్కని మలుపులు ఈ మూవీలో చాలా ఉంటాయి అనిపిస్తుంది. కాగా ముంబై వేదికగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ప్రభాస్,శ్రద్దా కపూర్,దర్శకుడు సుజీత్ తో పాటు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు మూవీ గురించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కాగా ఓ పాత్రికేయుడు ప్రభాస్ ని బాహుబలి కొరకు 5ఏళ్ళు సమయం కేటాయించిన మీరు, మళ్ళీ సాహో కొరకు రెండేళ్లు తీసుకున్నారు. మీకు ఇబ్బందిగా అనిపించలేదా అని అడుగగా, నిజానికి సాహో కొరకు ఇంత సమయం పడుతుందని ముందుగా ఊహించలేదు. యాక్షన్ సీక్వెన్స్ కొరకే దాదాపు ఓ సంవత్సర సమయం కేటాయించాల్సి వచ్చింది. ముఖ్యంగా అబుదాబి యాక్షన్ సీక్వెన్స్ కొరకు చాలా రోజులు షూటింగ్ జరిపాము అన్నారు. ఐతే అదే సమయంలో వచ్చే ఏడాది తాను కనీసం రెండు చిత్రాలను విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఐతే ఆ రెండు చిత్రాలు ఏమిటా అని అభిమానులు ఆలోచలలో పడ్డారు.

గతంలో ప్రభాస్ జిల్ మూవీ డైరెక్టర్ రాధా కృష్ణ తో ఓ మూవీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. మరి ప్రభాస్ చేయబోతున్న రెండు చిత్రాలలో ఒకటి ఆయనతోనే చేస్తారా లేక మరో దర్శకుడితో ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :