వైరల్ అవుతున్న ప్రభాస్ డాన్స్ వీడియో !

Published on Aug 22, 2019 9:24 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్ర‌భాస్‌ ‘నచ్‌ బలియే 9’ అనే హిందీ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అయితే ఈ షోకు న్యాయనిర్ణేతగా ఉన్న సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ చీర కొంగు నోట్లో పెట్టుకొని, ప్రభాస్ చిందులు వేస్తోన్న వీడియో ఒకటి ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహో మూవీకి టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకి పాండే జాకీ ష్రాఫ్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :