ఈ సమస్యపై ప్రభాస్ దర్శకుని సూటి ప్రశ్న.!

Published on Sep 29, 2020 10:10 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు నాగస్విన్ తో తెరకెక్కించనున్న స్కై ఫై థ్రిల్లర్ కూడా ఒకటి. ఈ భారీ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఎందరో ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్ హీరోలకు ప్రధాన సమస్యగా మారింది మాత్రం థియేటర్స్ విషయంలోనే అని చెప్పాలి.

థియేటర్స్ లో సినిమాలు చూసి చాలా కాలం అయ్యిపోవడంతో ప్రేక్షకులతో పాటు తాను కూడా ఆ అనుభవాన్ని ఎంతగానో మిస్సవుతున్నాని నాగశ్విన్ అంటున్నారు. ఇపుడు జిమ్ లు, బార్లు, ఫ్లైట్లు, మెట్రోలు, దేవాలయాలు ఇలా అన్నీ తెరిచినప్పుడు థియేటర్స్ తెరవడానికి కూడా ఇదే అనువైన సమయం అని భావిస్తున్నాని తన వ్యూ ట్వీట్ చేసారు. మాస్క్ వేసుకొని థియేటర్ లో సినిమాలు చూడ్డానికి ఎంతగానో ఎదురు చూస్తున్నామని అంతే కానీ అలా స్టక్ అయ్యి ఉండిపోవటానికి కాదని తన పాయింట్ ను క్లియర్ కట్ గా చెప్పేసారు.

సంబంధిత సమాచారం :

More