పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే హీరోయిన్ రిద్ధి కుమార్ ల కలయికలో దర్శకుడు మారుతీ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ది రాజా సాబ్’. హారర్ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఊహించని రీతి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకి వర్క్ చేసిన మారుతిపై సినిమా విడుదల అయ్యిన ఇన్ని రోజులు తర్వాత సోషల్ మీడియాలో ఆకస్మిక దాడి మొదలైంది.
రిలీజ్ అయ్యిన రోజు అభిమానులే చాలా వరకు తమకి సినిమా బాగా నచ్చిందని ఎన్నో ఏళ్లుగా మిస్ అవుతున్న ప్రభాస్ ని చూశామని అంతే కాకుండా ప్రభాస్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని కూడా ఓ రేంజ్ లో లేపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సీన్ కట్ చేస్తే క్యాలుక్యులేషన్స్ అంతా మారిపోయాయి. రెబల్ ఫ్యాన్స్ అంతా మారుతీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
మరి నిజంగా వాళ్ళు అంత ఖాళీగా ఉన్నారా లేక సినిమా విషయంగా నిజంగా అంత కోపంగా ఉన్నారా అనేది వారికే తెలియాలి కానీ సినిమా రిలీజ్ అయ్యిన ఇన్ని రోజులు తర్వాత సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువగా కొనసాగుతుంది. మరి ఈ సోషల్ మీడియా ట్రోల్స్, కామెంట్స్ పై మారుతీ సన్నిహిత వర్గాల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఏమన్నా వీటిపై ఓ క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాలి.


