రెబల్స్ డబుల్ ఫీస్ట్ తో రెడి అవుతున్నారు..!

రెబల్స్ డబుల్ ఫీస్ట్ తో రెడి అవుతున్నారు..!

Published on Jul 8, 2020 6:46 PM IST

ఎంతో కాలం నిరీక్షణ అనంతరం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ముహూర్తం కుదిరింది. ఎన్నో తారీఖులు సస్పెన్సులు తర్వాత అదే జూలై 10 న బాహుబలితో ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయబడిన రోజునే తాను నటిస్తున్న తాజా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కూడా ఉండటంతో రెబల్స్ కు అదే రోజున రెండు పనులు పడ్డట్టు అయ్యింది.

మన స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల రికార్డ్ బ్రేకింగ్ చిత్రాలు భారీ ఎత్తున ట్రెండ్స్ చేస్తుంటారు. అదే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ టైం లో కూడా ట్రెండ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ రెండు కొన్ని గంటల తేడాతోనే వచ్చేసాయి. మరి ఈ రెండు ట్రెండ్స్ ను రెబల్స్ ఎలా మైంటైన్ చేస్తారో చూడాలి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తాజా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు