ఈ విషయంలో బాగా నిరాశ చెందిన ప్రభాస్ ఫ్యాన్స్.!

Published on Oct 25, 2020 9:02 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు లేటెస్ట్ గా వచ్చిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ తో సూపర్బ్ హ్యాపీగా ఉన్నారు. రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమ కావ్యంపై ఇప్పుడు మరిన్ని అంచనాలు పెట్టుకొన్నారు. అయితే నిన్న పుట్టినరోజు సందర్భంగా “రాధే శ్యామ్” యూనిట్ ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.

అయితే ఈసారి ప్రభాస్ బర్త్ డే కు మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త ఎక్కువ ఆశలనే పెట్టుకున్నారు. కానీ అవి నిరాశలుగానే మిగిలాయి అని చెప్పాలి. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో రాధే శ్యామ్, అలాగే నాగశ్విన్ ల ప్రాజెక్ట్ లను పక్క పెడితే డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” యూనిట్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది అనుకున్నారు.

అలాగే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ల మోస్ట్ అవైటెడ్ కాంబో కు సంబంధించి కూడా మోస్ట్ అవైటెడ్ అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుంది ఏమో అని ఆశించారు. కానీ అటు నుంచు కూడా ఎలాంటి అలికిడి లేదు. దీనితో రెండు అంశాలలో ప్రభాస్ బర్త్ డే నాడు కాస్త నిరాశకు లోనయ్యారు.

సంబంధిత సమాచారం :

More