ఇండియా వైడ్ టాప్ లో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 20.

Published on Jul 8, 2020 12:27 pm IST

ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. జులై 10న ఉదయం 10:10 నిమిషాలకు ప్రభాస్ 20 నుండి ఫస్ట్ లుక్ రానుంది. ఈ విషయాన్ని ప్రభాస్ నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రభాస్ 20 ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో విరుచుకుపడుతున్నారు. దీనితో ప్రభాస్ 20 యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్ లో టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా కొనసాగుతుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా తన స్టామినా చూపిస్తున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్ పతాకంలో తెరకెక్కుతుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More