విదేశీ టూర్స్ వద్దు…,సెట్స్ తో లాగించేద్దాం-ప్రభాస్

Published on Nov 9, 2019 8:41 am IST

సాహో షాక్ ప్రభాస్ కి గట్టిగానే తగిలింది. దీనితో తదుపరి సినిమాల బడ్జెట్ విషయంలో ఆయన మైండ్ సెట్ మారిపోయింది. సాహో చిత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దీనికి కారణం ఆ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిచడంతో పాటు,అధిక ధరలకు విక్రయించడమే. దీనితో ప్రభాస్ తన ప్రస్తుత చిత్రం బడ్జెట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ మూవీ కథ ప్రకారం యూరోప్ లో షూటింగ్ జరపాల్సివుంది. ఇది విదేశాలలో నడిచే 1965 కాలం నాటి లవ్ స్టోరీ అని గతంలో కొన్ని ఇంటర్వ్యూ లలో ప్రభాస్ స్వయంగా చెప్పారు.

ఐతే గతంలో ఈ చిత్రాన్ని అక్కడే చిత్రీకరించాలని నిర్ణయించారు. అలాగే కొంత షూటింగ్ కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం చాలా భాగం వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో విదేశీ వాతావరణాన్ని తలపించేలా సెట్స్ వేసి చిత్రీకరించాలని భావిస్తోందట చిత్రం బృందం. దీనికొరకు తగు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. పరిసరాల్లో కనిపించే విదేశీయుల కొరకు ముంబై నుండి కొందరు విదేశీ నటులను తెచ్చుకోనున్నారట. కేవలం అవసరమైన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే విదేశాలలో చిత్రీకరిస్తారని సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ సరసన మొదటిసారి పూజా హెగ్డే నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More