ఆల్ ఇన్ వన్ ప్రభాస్ అంతే..!

Published on Aug 19, 2020 7:04 am IST

కేవలం ఒక మాస్ కుర్రాడి రోల్ తో తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సాక్ష్యత్తు దేవుని పాత్రనే పోషించే స్థాయికి ఎదిగాడు డార్లింగ్ హీరో ప్రభాస్. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ లో కనిపించని షేడ్ అంటూ ఏం లేదని చెప్పాలి. ఒక్క నటునిగా మాత్రమే కాకుండా తన సినిమాల ఎంపికలో చూసుకున్నా సరే ప్రభాస్ ఒక ఆల్ ఇన్ వన్ ప్యాక్ లా అయ్యాడని చెప్పాలి.జానర్ ఏదైనా సరే అందులో ప్రభాస్ సరిగ్గా సూటవుతున్నాడు.

అది ఒక గ్యాంగ్స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారి ఇప్పుడు రాముని పాత్రలో కనిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ విజువల్ లో కూడా ప్రభాస్ సెట్ అయిన దృశ్యాలు చాలా మంది ఊహించుకుంటున్నారు. ఇలా ప్రభాస్ రోల్ ఏదైనా కథ జానర్ ఏదైనా సరే కరెక్ట్ గా సెట్ అవుతూ ఆల్ ఇన్ వన్ గా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

సంబంధిత సమాచారం :