గ్లోబల్ గా రేర్ రికార్డు సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్.!

Published on May 13, 2023 10:02 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం ట్రైలర్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ కొల్లగొట్టి అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అయితే ఈ చిత్రం దాటేసింది.

అయితే ఇంట్రెస్టింగ్ గా గ్లోబల్ వైడ్ గా వరుసగా నాలుగు చిత్రాలకి వరుసగా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న ఏకైక హీరోగా అయితే ప్రభాస్ నిలిచాడట. దీనితో ఈ రేర్ రికార్డు ఉన్న ఏకైక హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. మరి బాహుబలి 2 తర్వాత నుంచి వచ్చిన ప్రతీ సినిమా ట్రైలర్ కూడా ఈ సెన్సేషనల్ మార్క్ ని క్రాస్ చేయడం విశేషం కాగా ఇక నెక్స్ట్ సినిమాలకి కూడా ఇదే సెన్సేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం :