నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ..!

Published on Feb 26, 2020 12:52 pm IST

దశాబ్దాల చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చింది. మహానటి చిత్రంతో అవార్డు విన్నింగ్ దర్శకుడిగా పేరుగాంచిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ప్రకటించారు. కొద్దిరోజులుగా దీనిపై ఊహాగానాలు వస్తున్నప్పటికీ నేడు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ విషయం తెలియజేశారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు ఈ సంస్థ గతంలో ప్రకటించింది. ఆ భారీ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ నిర్మిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ తో భారీ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ని పిదా చేశారు.

సంబంధిత సమాచారం :