ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు వరుసగా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే ప్రస్తుతం సెట్స్ మీద కొన్ని సినిమాలు ఉండగా ఈ నెక్స్ట్ వీక్ రిలీజ్ కి అవైటెడ్ “సలార్” సిద్ధంగా ఉంది. అయితే గత కొన్ని రోజులు కితమే ప్రభాస్ “కల్కి” కోసం ప్రిపేర్ చేసిన ఒక డాషింగ్ అండ్ మాస్ లుక్ అయితే ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది. ఆ గడ్డం స్టైల్ చూసి చాలా మంది స్టన్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇప్పుడు క్లాస్ లుక్ లోకి మారిన ప్రభాస్ మరోసారి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. సలార్ ప్రమోషన్స్ లో కనిపించిన ప్రభాస్ ఈ సరికొత్త లో సూపర్ కూల్గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. దీనితో ఈ సరికొత్త క్లాస్ లుక్ కూడా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. మరి ఇది ఏ సినిమా కోసం అయినా చేసిందో లేక జస్ట్ ప్రమోషన్స్ కోసమే చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఫ్రెష్ లుక్ లో ప్రభాస్ అదిరిపోయాడు.
