ప్రభాస్ హ్యాండ్ సమ్ లుక్ మెస్మరైజ్ చేస్తుందట..!

Published on May 8, 2020 9:07 am IST

టాలీవుడ్ లో హ్యాండ్ సమ్ హీరోలలో ప్రభాస్ ఒకరు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ తో పాటు భారీ లేడీ ఫోలోయింగ్ ఉంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలలో ఆయన స్టైలిష్ లుక్స్ భారీ గర్ల్స్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. కాగా ప్రభాస్ లేటెస్ట్ పీరియడ్ లవ్ డ్రామాలో ప్రభాస్ లుక్ చాల హ్యాండ్ సమ్ గా ఆయన లేడీ ఫ్యాన్స్ ని ఫిదా చేసేదిలా ఉంటుందట. ఆయన రెండు భిన్న గెటప్స్ లో ఈ చిత్రంలో కనిపిస్తాడట. పీరియాడిక్ మరియు మోడరన్ లుక్స్ లో ప్రభాస్ లుక్ ఫీస్ట్ లా ఉంటుందని సమాచారం.

దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మొదటిసారి ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :