“సలార్” సెట్స్ లో ప్రభాస్..లుక్స్ వైరల్.!

Published on Aug 12, 2021 11:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుంచి మళ్ళీ ఒక సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ పడి చాలా కాలమే అయ్యింది.. దీనితో ఆ లోటుని “సలార్” చిత్రం తీరుస్తుంది అని యంగ్ రెబల్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ షూట్ ఇప్పుడు హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటుంది.

అయితే శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ పక్కా మాస్ అండ్ రగ్గుడ్ కటౌట్ లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు ప్రభాస్ వి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్ లుక్స్ లో ప్రభాస్ సలార్ సెట్స్ లో కనిపిస్తున్నాడు. దీనితో ప్రభాస్ లుక్స్ యిట్టే వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా హోంబేలె పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :