అభిమానులను కలుసుకున్న ప్రభాస్.

Published on Dec 12, 2019 12:46 am IST

డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులను స్వయంగా కలుసుకొని వారిని ఫిదా చేశారు. సాహో మూవీ విడుదల సమయంలో అభిమానుల కొరకు ఓ కాంటెస్ట్ నిర్వహించగా ఆ కాంటెస్ట్ నందు గెలిచిన వారిని ప్రభాస్ కలవడం జరిగింది. ప్రభాస్ ని స్వయంగా కలిసే అవకాశం దక్కించుకున్నందుకు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న జాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మొదటి సారి ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నారు.

కాగా ప్రభాస్ గత చిత్రాల వలె జాన్ మూవీ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెట్ తో వస్తుంది. యూరోప్ నేపథ్యంలో 1960ల కాలం నాటి ప్రేమకథగా జాన్ మూవీ తెరకెక్కుతుంది. సాహో, బాహుబలి చిత్రాల వలె జాన్ చిత్రం కూడా పలు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర బడ్జెట్ కూడా 150కోట్లకు పైన ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో జాన్ విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More