తెలుగు సినిమా హీరోలు ఎన్ని రకాలైన వీరోచిత పాత్రలు చేసినా ఒక్క పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతుందీ, కలెక్షన్లనూ రాబడుతుంది. నాటి తరం హీరోల నుంచి నేటి స్టార్ హీరోల వరకూ ప్రతీ ఒక్క హీరో ఆ పాత్రలో ఒదిగిపోవాలనే కలలు కంటూంటాడు. అదే పోలీస్ పాత్ర. ఇప్పటి స్టార్ హీరోల విషయానికి వస్తే.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్సంతా పోలీస్ పాత్రలతో హిట్టు కొట్టినవాళ్ళే. ఇప్పుడు తాజాగా.. ఆ లిస్ట్‌లోకి ప్రభాస్ చేరిపోవాలని చూస్తున్నట్టు సమాచారం.
అసలే ఆరడుగుల పైనే హైటు, ఆపైన చక్కని శరీరాకృతి కలిగి ఉన్న ప్రభాస్ గనక పోలీస్ పాత్రలో నటిస్తే అభిమానులకది పండుగే! ఇప్పటి వరకు ఎన్నో మాస్ పాత్రల్లో, యంగ్ అండ్ డైనమిక్ పాత్రల్లో, లవర్‌బాయ్ లాంటి పాత్రల్లో మనల్ని మెప్పించిన ప్రభాస్.. ఎప్పుడూ పోలీస్ పాత్రలో నటించలేదు. ప్రస్తుతం బాహుబలి చిత్రంతో బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత నటించే సినిమాలో ఆయనది పోలీస్ పాత్ర అని సమాచారం. బాహుబలి చిత్రీకరణ పూర్తవగానే ఈ సినిమా విషయమై ప్రభాస్ ఆలోచిస్తున్నారని సమాచారం.


