ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే కు టార్గెట్ లాక్ చేసారు.!

Published on Oct 23, 2020 5:45 pm IST

ఈరోజు అక్టోబర్ 23 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ కు విషెష్ వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు సినీ తారలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టుల తాలూకా నిర్మాణ సంస్థలు కూడా తమ హీరోకు గర్వంగా విషెష్ తెలుపుతున్నారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మూడు బడ్జెట్ చిత్రాలలో ఒకటైన ప్రభాస్ – నాగశ్విన్ ల నిర్మాణ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ వారు ఒక ఊహించని అప్డేట్ ను ముందుంచారు. ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే సమయానికి ఖచ్చితంగా ఒక ఊహించని గిఫ్ట్ ఇస్తామని టార్గెట్ లాక్ చేసారు.

దీనితో ఇప్పుడు మరింత సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి. ఇప్పుడప్పుడే అయితే మొదలయ్యే సూచనలు ఈ చిత్రానికి కనిపించడం లేదు. స్కై ఫై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నాగశ్విన్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో లెజెండరీ నటులు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ మరియు అక్కడి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె లు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More