ప్రభాస్ టైటిలైతే అది కాదు..!

Published on Jan 19, 2020 3:00 am IST

అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ తెలియజేశారు. అలాగే ఆ షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన సెట్ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఐతే ప్రభాస్ ఎక్కడా టైటిల్ జాన్ అని ప్రస్తావించలేదు. కాబట్టి ఈ చిత్ర టైటిల్ జాన్ ఐతే కాదని తెలిసిపోతుంది. జాన్ ప్రభాస్ మూవీ వర్కింగ్ టైటిల్ అని చెప్పడం జరిగింది. ఐతే టైటిల్ ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయేలా మంచి సౌండింగ్ కలిగి ఉండటంతో ఇదే ఫైనల్ చేసే అవకాశం కలదని అందరూ భావించారు. ప్రభాస్ తాజా పోస్టులో ఈ టైటిల్ ప్రస్తావన రాకపోవడంతో జాన్ టైటిల్ పట్ల చిత్ర యూనిట్ అంత ఆసక్తిగా లేరని అర్థం అవుతుంది.

ఇక జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ చిత్రాన్ని పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లేదా దసరా కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :