మళ్ళీ మొదటికి వచ్చిన ప్రభాస్ వ్యవహారం.. !

Published on Feb 27, 2020 7:07 am IST

కొన్నేళ్లుగా ప్రభాస్ నుండి సినిమా రావడం అనేది గగనం అయిపోయింది. రేండేళ్లకు కానీ ఆయన నుండి మరో సినిమా రావడం లేదు. బాహుబలి సినిమాకు ముందు ఏడాదికి రెండు లేదా కనీసం ఒక సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ బాహుబలి రెండు చిత్రాల కోసం ఐదేళ్ల కేటాయించారు. బాహుబలి2 మూవీ 2017లో విడుదల కాగా మరో రెండేళ్లకు 2019లో సాహో విడుదల అయ్యింది. సరే ఈ రెండు చిత్రాల తరువాత నుండైనా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే రాధా కృష్ణ తో ఆయన చేస్తున్న రొమాంటిక్ లవ్ పీరియడ్ డ్రామా షూటింగ్ నత్త నడకన సాగుతుంది.

ఈ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం కలదు. కాగా నిన్న మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మూవీ ప్రకటించారు. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా కు మించి ఉంటుంది అని దర్శకుడు చెప్తున్న తరుణంలో ఈ చిత్రం కొరకు ప్రభాస్ మళ్ళీ ఎన్నేళ్లు కేటాయిస్తాడో అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. నాగ్ అశ్విన్ ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి 2021లో విడుదల చేస్తాం అని చెవుతున్నా… భారీ స్కేల్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న నేపథ్యంలో చెప్పిన టైమ్ కి వస్తుందనే గ్యారంటీ లేదు. దీనితో ప్రభాస్ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది.

సంబంధిత సమాచారం :