రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్ తన ఫోకస్‌ను ‘ఫౌజీ’ వైపు మళ్లించాడని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ఆయన బల్క్ డేట్స్ కేటాయించడంతో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ముగుస్తుండటంతో, నిర్మాతలు ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఓటీటీ బిజినెస్ పూర్తయిన వెంటనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారట. ఈ భారీ యాక్షన్ డ్రామా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లలో ప్రస్తుతం కీలక షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ పీరియాడిక్ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ‘ఫౌజీ’ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే, ప్రభాస్ ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. మరి నిజంగానే ఫౌజీ చిత్రాన్ని తాను అనుకున్న విధంగా ప్రభాస్ పూర్తి చేస్తాడా.. అనేది చూడాలి.


