ఆస్ట్రియా, కురేషియాలో సాంగ్స్ పూర్తి చేసిన ‘ప్ర‌భాస్’ !

Published on Jul 10, 2019 3:36 pm IST

ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతున్న చిత్రం ‘సాహో’. అగ‌ష్టు 15న భార‌తదేశ స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లయ్యిన సైకో స‌య్యో అనే సాంగ్ కి బాలీవుడ్‌, టాలీవుడ్‌, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విప‌రీత‌మైన బ‌జ్ రావ‌టంతో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వున్నారు. ఈ సాంగ్ లో యంగ్‌ రెబ‌ల్‌ స్టార్ చాలా స్టైలిష్ గా క‌నిపించ‌టం అభిమానుల్ని సంతోషంలో ముంచింది. అలాగే హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ చాలా అందంగా క‌నిపించింది. సాంగ్ లో ప్ర‌భాస్‌, శ్ర‌థ్థా లు చేసిన డాన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఆస్ట్రియాలోని అంద‌మైన లోకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని కురేషియాలోని చిత్రీక‌రించారు. ఈ సాంగ్ 50 మంది మిస్ కురేషియా మెడ‌ల్స్ తో షూట్ చేసారు. అలాగే అబుధ‌బిలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని ఆశ్య‌ర్యంలో ముంచెత్తుతాయి. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది.

సంబంధిత సమాచారం :

X
More