‘విలన్’తో ప్రభాస్ భారీ యాక్షన్ చేజ్‌ ?

Published on Oct 20, 2018 5:27 pm IST

ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రొమానియాలో చిత్రబృందం ఓ భారీ యాక్షన్ చేజ్‌ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ యాక్షన్ చేజ్‌ కు సంబంధించిన షూట్ లో ప్రభాస్‌తో పాటు విలన్ గా నటిస్తున్న నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కూడా పాల్గొనబోతున్నాడని సమాచారం. వీరి మధ్య జరిగే చేజ్‌ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

కాగా ఇప్పటికే దుబాయ్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను చిత్రబృందం షూట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టినరోజు కంటే ఒక రోజు ముందుగానే అక్టోబర్ 22న టీజర్ ని రిలీజ్ చెయ్యాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ తో కూడుకున్న యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సంబంధిత సమాచారం :