ప్రభాస్ ‘సలార్’లో మరో బాలీవుడ్ హీరో !

Published on May 24, 2021 6:43 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో విలన్ గా కనిపించబోతున్నాడట. జస్ట్ గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ అని, కాకపోతే విలన్స్ ను లీడ్ చేసే మెయిన్ విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇంతకీ విలన్ గా ఎవరు నటిస్తున్నారు అంటే జాన్ అబ్రహం అట. ఇక ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూట్ స్టార్ట్ చేయనున్నారు. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించనున్నాడు.

సంబంధిత సమాచారం :