తన “రాధే శ్యామ్” యూనిట్ కు సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపిన డార్లింగ్.!

తన “రాధే శ్యామ్” యూనిట్ కు సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపిన డార్లింగ్.!

Published on Jan 15, 2021 12:05 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా మొత్తం దేశ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ను డార్లింగ్ హీరో ప్రభాస్ తెచ్చుకున్నాడు. అంత స్టార్డం ఉన్నా సరే ఒదిగే ఉంటాడు అదే ప్రభాస్ లోని గొప్పదనం అని అతని అభిమానులు కాలర్ ఎగరేసి చెబుతారు.

మరి అలాగే ప్రభాస్ సైలెంట్ గా ఇచ్చే సర్ప్రైజ్ పనులు కూడా మరి వారికి చాలా ఆనందం కలిగిస్తాయి. ఇప్పుడు అలానే ప్రభాస్ తాను ఇప్పుడు చేస్తున్న చిత్ర యూనిట్ “రాధే శ్యామ్” బృందానికి సినిమా షూట్ కంప్లీట్ కావడంతో స్పెషల్ రిస్ట్ వాచ్ లను సర్ప్రైజ్ బహుమతులుగా పంపి ఆశ్చర్యపరిచాడు.

టైటాన్ మరియు ట్రాక్ వాచెస్ ను తన సినిమాకు పని చేసిన యూనిట్ మొత్తానికి పంపగా వారు ఆ ఊహించని గిఫ్ట్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఇవే ప్రభాస్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు