కృష్ణం రాజు పుట్టిన రోజు వేడుకలలో ప్రభాస్.

Published on Jan 20, 2020 12:19 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న గారైన నటుడు కృష్ణం రాజు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణం రాజు 80వ జన్మదిన వేడుకలు గత రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంచలంచెలుగా ఎదిగిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

ఇక ఆయన లేటెస్ట్ మూవీ షెడ్యూల్ త్వరలో తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే దాదాపు 20-30 శాతం ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. 1960ల నాటి పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More