“ఆదిపురుష్” కోసం ప్రభాస్ స్పెషల్ డైట్.!

Published on May 22, 2021 8:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అలాగే ఈ చిత్రం అనే కాకుండా ప్రభాస్ మరో రెండు చిత్రాల షూట్ లో ఏకకాలంలో పాల్గొనాల్సి ఉంది. అయితే వాటిలో రాధే శ్యామ్ షూట్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది జస్ట్ కొంత మాత్రమే ఉంది.

కానీ “సలార్” మరియు ఆదిపురుష్ చిత్రాలకు భిన్నమైన లుక్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ చెయ్యాల్సి వస్తుంది. మరి అలా వాటిలో ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ చేస్తున్న రాముని పాత్రకు ఎలాంటి డైట్ తీసుకుంటున్నాడో ఈ చిత్రంలో లక్ష్మణ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ యువ నటుడు సన్నీ సింగ్ తెలియజేసాడు.

ప్రభాస్ తన లుక్ కోసం ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవడం లేదని పూర్తిగా ఆహార డైట్ తోనే పెంచుతున్నాడని అందులో భాగంగా మంచి ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని సరిపడా మోతాదులో తీసుకుంటున్నాడని తెలిపాడు. ఇది వరకే ప్రభాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసాము మరి రాముని పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :