ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా !
Published on Oct 15, 2017 8:01 pm IST

‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ స్థాయి ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా మంది టాప్ దర్శకులు, బడా నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభాస్ మాత్రం ‘రన్ రాజా రన్’ అనే ఒకే ఒక్క సినిమా చేసిన సుజీత్ కు ‘సాహో’ రూపంలో ఛాన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రేక్షకులంతా ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు.

పైగా ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదైనా సప్రైజ్ ఉంటుందేమోనని ఆశపడుతున్నారు. వాళ్ళు ఆశపడినట్లే ‘సాహో’ టీమ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ప్రభాస్ యొక్క స్పెషల్ ఫోటో షూట్ ను రిలీజ్ చేయనుంది. దీనికి సంబందించిన ఫోటోషూట్ సెషన్స్ కూడా ఈరోజే జరిగాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook