కోట్లు కుమ్మరిస్తున్న ప్రభాస్ !

Published on May 17, 2019 10:05 pm IST

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ స్థాయి జాతీయ స్థాయికి మారిపోయింది. అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలకి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే తన తర్వాతి సినిమాల నిర్మాణం విషయంలో రెబల్ స్టార్ అస్సలు రాజీపడటం లేదు. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్లోనే రెండు సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.

వాటిలో మొదటిది ‘సాహో’. ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. ఇక రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం కూడా పెద్ద మొత్తాన్ని కుమ్మరిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం విదేశాల నేపథ్యంలో జరుగుతుంది. అందుకే ఫారిన్ లొకేషన్లను హైదరాబాద్లోనే సెట్స్ వేసి రీక్రియెట్ చేస్తున్నారు. మొత్తం 18 సెట్ల కోసం దాదాపు 30 కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు యొక్క సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ సైతం పాలుపంచుకుంటోంది.

సంబంధిత సమాచారం :

More