అప్పుడే కొత్త మేకోవర్ స్టార్ట్ చేసేసిన ప్రభాస్.!

Published on Nov 25, 2020 10:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో మొదటి వరుసలో ఉన్న “రాధే శ్యామ్” పూర్తి కానుండగా దాని తర్వాత చేయనున్న “ఆదిపురుష్” కూడా లైన్ లో ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైనవి కావడంతో అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇపుడు రాధే శ్యామ్ లో ఒక లవర్ బాయ్ రోల్ కనిపించనున్న డార్లింగ్ ఇప్పుడు తనలోని పౌరాణిక పాత్ర చూపేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

అందుకే అప్పుడే మేకోవర్ ను కూడా మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ ఇపుడు రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటుంటే స్లిమ్ గా మారిపోతున్నట్టు తన లేటెస్ట్ ఫోటోలను చూస్తే అర్ధం అవుతుంది. మరి ప్రభాస్ నీలి మేఘ శ్యామునిగా ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ 3డి లో భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ లా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే 2022 ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More