యాక్షన్ వరల్డ్ లోకి ఎంటరైన ప్రభాస్ !

18th, August 2017 - 10:33:32 AM


ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ సింగ్ మొదటి షెడ్యూల్ ను ప్రభాస్ లేకుండానే ముగించేయగా ఈరోజు నుండి రెబల్ స్టార్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. సుమారు నాలుగున్నరేళ్ళ ‘బాహుబలి’ ప్రయాణం తర్వాత వేరే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను. కొత్త యాక్షన్ ప్రపంచంలోకి వెళుతున్నందుకు చాలా ఎగ్జైటింగా ఉంది అంటూ ప్రభాస్ ఈ విషయాన్ని తెలియజేశారు.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యంత ఎక్కువ బడ్జెట్ కలిగిన సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రతి నాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ కనిపించనున్నాడు.