కొత్త సినిమా కోసం ప్రభాస్ గ్రౌండ్ వర్క్ !
Published on Apr 26, 2018 4:38 pm IST

హీరో ప్రభాస్ జూన్ 7వ తేదీ నుండి ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో మొదలుకానున్న కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’కు పూర్తి భిన్నంగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది ఈ కొత్త సినిమా. అందుకే ముందుగా హీరో ప్రభాస్, హీరోయిన్ పూజ హెగ్డేల కోసం మే మొదటి వారంలో ముంబైలో వర్క్ షాప్స్ నిర్వహించనున్నారు.

ప్రభాస్ ‘సాహో’ దుబాయ్ షెడ్యూల్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఈ వర్క్ షాప్స్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రాన్ని కొంత భాగం యూరప్ లో సైతం చిత్రీకరించనున్నారు.

 
Like us on Facebook