పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రస్తుత చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. అయితే ఈపాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇంకోపక్క సరైన అప్డేట్స్ కూడా లేక అభిమానులు బాగా సతమతమవుతున్నారు.
మరి ఫైనల్ గా పలు ఇంట్రెస్టింగ్ వార్తలు ఒకొకటిగా బయటకి వస్తున్నాయి. ఇలా టీజర్ మరో రెండు వారాల్లోనే విడుదలకి వస్తుంది అని టాక్ రాగా ఇప్పుడు ప్రభాస్ ఎప్పటికి కంప్లీట్ చేసేయనున్నాడో క్లారిటీ వినిపిస్తోంది. ప్రభాస్ పోర్షన్స్ 80 నుంచి 85 శాతం మేకర్స్ కంప్లీట్ చేయగా మిగతా మొత్తం ఈ జూన్ లేదా జూలై కి డార్లింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడట. సో మొత్తానికి ఒక సినిమాకి ప్రభాస్ శుభం పలకనున్నాడని చెప్పవచ్చు.


