ఓకే రోజు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్ ?

Published on Oct 14, 2018 3:22 pm IST

‘బాహుబలి’ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రభాస్ ఒకే రోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తియింది. ఈసినిమా యొక్క టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 కంటే ఒక రోజు ముందుగానే అక్టోబర్ 22 న విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ప్రభాస్ ఈ చిత్రం తో తన 20వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కూడా అదే రోజు విడుదల చేయనున్నన్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ న్యూస్ నిజమైతే ప్రభాస్ అభిమానులకు పండగే.

సంబంధిత సమాచారం :