తన వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ కి ప్రభాస్ అప్పుడు జాయిన్ కానున్నాడా?

Published on Aug 5, 2021 11:01 am IST

పాన్ ఇండియన్ లెవెల్లో ఒక రేంజ్ లో క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో పాటుగా పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామా “ప్రాజెక్ట్ కే” గా తెరకెక్కుతుంది. మరి ప్రస్తుతం ప్రభాస్ లేకుండానే షూట్ ను స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ప్రస్తుతానికి “సలార్” షూట్ లో బిజీగా ఉన్న డార్లింగ్ దాని తర్వాత “ఆదిపురుష్” ని కొంతమేర కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కే కి రావడానికి ఈ ఏడాది కంప్లీట్ అయ్యిపోతుందని తెలుస్తుంది. దీనితో తన వరల్డ్ ప్రాజెక్ట్ లో జనవరి నుంచి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సూపర్ హీరో రోల్ లో కనిపిస్తాడని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు ఇండియా లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :