సింగీతం వారి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ ‘సింగ్ గీతం’కు ప్రభాస్ సపోర్ట్..!

సింగీతం వారి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ ‘సింగ్ గీతం’కు ప్రభాస్ సపోర్ట్..!

Published on Jun 11, 2026 10:02 PM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సింగ్ గీతం’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల దగ్గర్నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సింగీతం సినీ ప్రయాణాన్ని అభినందిస్తూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు రెబల్ స్టార్ ప్రభాస్.

‘‘నాటి క్లాసిక్ ‘మాయాబజార్’ చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేసినప్పటి నుండి.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన వైవిధ్యభరిత టైమ్‌లెస్ క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించే వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ తర్వాత కూడా, నేటికీ ఆయన అదే ఉత్సాహంతో మెగా ఫోన్ పట్టి, సరికొత్త కలలను కంటూ.. భావితరాల దర్శకులకు, ప్రేక్షకులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.’’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

ఈ విలక్షణమైన కలల ప్రాజెక్ట్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించి, వెనుక నిలబడినందుకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ స్పెషల్ విషెస్ తెలిపాడు. ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు