‘ఆది పురుష్’కి కూడా బ్రేక్ పడిందా ?

Published on Apr 18, 2021 10:38 pm IST

నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో చేస్తోన్న “ఏ- ఆది పురుష్” సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని షూటింగ్ చేస్తోన్నా.. అది అంత సేఫ్టీ కాదని దర్శకనిర్మాతలు ఈ సినిమా షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా నెక్స్ట్ షెడ్యూల్ లో ఆదిపురుష్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌ లో ఓ కీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట.

దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మరి భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్నారు. అన్నట్టు ఆదిపురుష్ లో ఓ అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు హేమా మాలిని అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్రలో తీసుకున్నారని వార్తలు వచ్చాయి. మరి ఆ వార్తల్లో నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :